Tremor
వయస్సుతో సంబంధం లేకుండా కొంతమందికి కాళ్లలో తిమ్మిర్లు వస్తుంటాయి.. లేదా కాళ్లలో ఏదో పాకుతున్నట్టుగా అన్పిస్తుంటుంది. శరీరంలో నెర్వ్ దెబ్బతినడమంటే చాలా గంభీరమైన పరిస్థితిగా చెప్పవచ్చు. ఈ సమస్యను ప్యారేస్థీషియా అంటారు. ఈ సమస్య తలెత్తినప్పుడు కాళ్లు తిమ్మిరెక్కుతుంటాయి లేదా కాళ్లలో సత్తువ కోల్పోయినట్టుగా అన్పిస్తుంది. చాలామంది డయాబెటిస్ వ్యాధిని తేలిగ్గా తీసుకుంటారు. ఈ లక్షణం గంభీరమైన వ్యాధికి సంకేతం కావచ్చు. కానీ నరం దెబ్బతినడం వల్ల వచ్చే సమస్య ఇది. ఈ సమస్య ఉన్నప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. తక్షణం వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది.
తిమ్మిర్లు ఎందుకు వస్తాయి ? Tremor
నరాలు ఒత్తిడికి గురైనప్పుడు శరీరం తిమ్మిర్లు రూపంలో సంకేతాలిస్తుంది. ఒక్కోసారి ఆ చోట స్పర్శ కూడా తెలీదు. ఈ పరిస్థితినే న్యూరోపతీ అంటారు. అయితే, తిమ్మిర్లు అన్నీ ఒకే రకమైనవిగా భావించకూడదు. వీటిలో కూడా తేడాలు ఉంటాయి. ఎక్కువ సేపు కదలకుండా కుర్చున్నప్పుడు సూదులతో గుచ్చుతున్నట్లుగా ఉండటం, మంటలు ఏర్పడటాన్ని పాజిటీవ్ తిమ్మిర్లు అంటారు. నెగటివ్ తిమ్మిర్లు దీర్ఘకాలికంగా వేధిస్తాయి. ఇవి ఎక్కువ నొప్పి పెడతాయి. ఈ తిమ్మిర్ల వల్ల స్పర్శ కూడా కోల్పోతారు. నరాలు ఒత్తిడికి గురైనప్పుడు నెగటివ్ తిమ్మిర్లు ఏర్పడతాయి. వీటిని ప్రెషర్ పాల్సీస్ అని కూడా ఉంటారు. ఇలాంటి న్యూరోపతీ సమస్యలు ఏర్పడినప్పుడు వెంటనే డాక్టర్ ని కలవాలి.
డయబెటీస్ రోగుల్లోనే ఎక్కువ
డయబెటీస్ రోగుల్లో ఎక్కువగా తిమ్మిర్లు ఏర్పడుతుంటాయి. వీరు నిత్యం అరికాళ్ల మంటలతో బాధపడతారు. నడవకపోయినా సరే కాళ్లు చివ్వుమని నొప్పి పెడతుంటాయి. ఈ తిమ్మిర్లు ఒక్కసారి నరకాన్ని చూపిస్తాయి. మధుమేహం ప్రారంభంలో ఈ తిమ్మిర్లు కాళ్లకే పరిమితమవుతాయి. వ్యాధి ముదిరేకొద్ది తిమ్మిర్లు అన్ని అవయవాలకు పాకేస్తాయి. డయబెటిక్ చికిత్సకు ఇచ్చే ఇన్సులిన్ వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. దీన్నే ఇన్సులిన్ న్యూరైటిస్ అంటారు. మధుమేహం వల్ల శరీరంలో ఉండే పొడవైన నరమే ముందుగా ఎఫెక్ట్ అవుతుంది. ఈ నరాలు కాళ్లలో ఉంటాయి. దీంతో మధుమేహం ఎటాక్ చేయగానే తిమ్మిర్లు కాళ్ళలోనే మొదలవుతాయి. మధుమేహం ఉందని తెలుసుకొనేసరికే శరీరంలోని 20 పైగా నరాలు దెబ్బతిని ఉంటాయట.
వంశపారంపర్యంగానూ వస్తాయ్……
ఈ తిమ్మిర్లు కొందరికి వంశపారంపర్యంగా సంక్రమిస్తాయట. దీన్నే హెరిడిటరీ న్యూరోపతీ లయబిలిటీ టు ప్రెషర్
పాల్సీస్ అంటారు. వీరికి నిత్యం నరాలు జివ్వుమంటూ ఇబ్బంది కలిగిస్తుంటాయి. కొద్ది సేపు చేతులను కదల్చకుండా ఉంచినా తిమ్మిర్లు వచ్చేస్తాయి. స్థూలకాయం, క్యాన్సర్, ఎయిడ్స్, హైపోథైరాయిడ్, రుమటాయిడ్ ఆర్థ్రయిటిస్‌లకు చికిత్స తీసుకునే రోగులు, కనెక్టివ్ టిష్యూ డిజార్డర్ ఉన్న రోగుల్లో కూడా ప్రెషర్ పాల్సీ కనిపిస్తుంది. ఫోలిక్ యాసిడ్ లోపం, విటమిన్ B12, థయమిన్, పైరిడాక్సిన్ డెఫిషియన్సీ, పైరిడాక్సిన్ ఎక్సెస్‌కు గురయ్యేవారిలో కూడా తిమ్మిర్లు ఏర్పడతాయి. క్షయ రోగులకు ఇచ్చే మందుల ప్రభావం వల్ల కలిగే పైరిడాక్సిన్ డెఫిషియన్సీ వల్ల తిమ్మిర్లు వస్తాయి. మద్యం అతిగా తాగేవారిలో కూడా తిమ్మిర్లు ఏర్పడతాయి. వీటిని ఆల్కహాలిక్ న్యూరోపతీ అంటారు.
తిమ్మిర్లను వస్తే ఏం చేయాలి… Tremor
Tremor
తిమ్మిర్లు ఎక్కువ రోజులు వేధిస్తుంటే తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. తిమ్మిర్లు మీ శరీరంలో తీవ్రమైన అనారోగ్యానికి సంకేతాలని గుర్తించాలి. అయితే, ఈ తిమ్మిర్లు చాలా వ్యాధులతో ముడిపడి ఉంటాయి. అందుకే వైద్యులు ముందుగా రోగికి థైరాయిడ్, డయబెటీస్, విటమిన్ డెఫిషియన్సీ పరీక్షలు నిర్వహిస్తారు. నర్వ్ కండక్షన్ ద్వారా తిమ్మిర్లను అంచనా వేస్తారు. ఒక వేళ మీ నోట్లో మౌత్ అల్సర్, కీళ్ల నొప్పుల్లాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనెక్టివ్ టిష్యూ డిజార్డర్ గా భావిస్తారు. కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు ఎక్కువగా ఉంటే మెదడు సంబంధ సమస్యలుగా గుర్తించాలి. కొన్ని తిమ్మిర్లు క్రమేణా పక్షవాతానికి దారితీయవచ్చు. ఆ తిమ్మిర్లు చిన్నగా ముదిరి పక్షవాతానికి దారితీస్తాయి.
తిమ్మిర్లు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి………
శరీరాన్ని ఎక్కువ సేపు కదల్చనప్పుడే తిమ్మిర్లనేవి ఏర్పడుతుంటాయి. తిమ్మిర్లు తగ్గించుకోడానికి వ్యాయమం, యోగా ఒక్కటే సరైన మందు. ఎక్కువ దూరాలు ప్రయాణించేవారు లేదా వాహనాలను నడిపేవారు కనీసం రెండు గంటలకు ఒకసారైన విశ్రాంతి తీసుకోవాలి. వాహనం దిగి కాసేపు నడవాలి. ఎక్కువ సేపు టైప్చేసేవాళ్లు, కంప్యూటర్లలో డాక్యుమెంటేషన్ చేసేవాళ్లు వేళ్లకు అప్పుడప్పుడు విశ్రాంతినివ్వాలి. లేదా వేళ్లకు ప్యాడ్స్ వంటివి ధరించైనా పని చేయాలి. ఎక్కువ బిగుతుగా ఉండే షూ లేదా చెప్పులు ధరించినా తిమ్మిర్లు పుడతాయి. నరాలు ఒత్తిడికి లోనవుతాయి. కాబట్టి వీలైనంత వదులైన షూలే వేసుకోండి.
వ్యాయామం తప్పని సరి
శరీరం తిమ్మిర్ల బారిన పడుతుంటే మీలో శారీరక చురుకుదనం తగ్గుతోందని కూడా గమనించాలి. అధిక బరువు ఉన్న వారు, డయాబెటిస్ ఉన్న వారు తరచుగా తిమ్మిర్ల బారిన పడుతుంటారు. అందువల్ల వారు శారీరక శ్రమ పెంచాలి. ఒకవేళ వారికి కదలిక లేని జీవన శైలి అయితే తక్షణం 30 నుంచి 40 నిమిషాల పాటు నడక, తేలికపాటి వ్యాయామాలు ప్రారంభించాలి.