వింటర్ (winter) సీజన్ వచ్చేసింది. చాలా మంది ఈ సీజన్ లో చర్మనికి సంబంధించిన ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. చర్మం పొడిబారడం, పెదాల పగుళ్ళు, చర్మం పగుళ్ళు, దద్దుర్లు వంటివి రావడం సహజమే. దీనికి పరిష్కారంగా వివిధ రకాల మాయిశ్చరైజర్లను వాడడం మాములే. చలికాలంలోనే చర్మం ఎందుకు పొడిబారుతుందంటే…
చలికాలం వాతావరణంలో తేమ శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా చర్మం డ్రై గా , తెల్లగా మారుతుంది. శీతాకాలంలో వాతావరణం చల్లగా ఉండటం వలన నీటిని తక్కువగా తాగుతూ ఉంటాం. సరిపడా నీటిని తాగడం మన చర్మానికి ఎంతో మంచిది. ఈ కాలంలో చలి ఎక్కువగా ఉండటం వలన అధికంగా వేడిగా ఉండే నీటితో స్నానం చేస్తారు. దీనివల్ల కూడా ఒళ్లు తెల్లగా, బూడిద పూసినట్లు అవుతుంది. అలా కాకుండా గోరువెచ్చని నీటితో లేదా మాములు చల్లగా ఉన్న నీటితో స్నానం చేయటం మంచిది. ఇలా చేయడం వలన చర్మానికి హాని కలగకుండా కాపాడుకోవచ్చు.
ఇంట్లోనే దోరికే సహజమైన మాయిశ్చరైజర్లు…
చలికాలంలో ముఖం, చర్మం పగలకుండా మృదువుగా ఉండాలంటే సహజంగా ఇంట్లో దొరికే వెన్నపూస, తేనె, కొబ్బరినూనె , అలోవెరా, ఆలివ్ ఆయిల్, బాదం నూనె వంటివి వాడటం వలన ముఖం సున్నితంగా ఎలాంటి పగుళ్లు లేకుండా చలికాలంలో కూడా చక్కగా ఉంటుంది. (winter)
వెన్నపూస:
దీనిలో మాయిశ్చరైజర్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. స్నానానికి ముందు వెన్నపూసను ముఖం మరియు ఇతర చర్మ భాగాలకు రాసి కోంతసేపు మసాజ్ చేయడం వల్ల చర్మం మృదువుగా, కొమలంగా తయారవుతుంది. పొడిబారడం వంటి సమస్యల నుండి కాపాడుతుంది.
అలొవెరా:
ఇది మన ఇంట్లో ఉండే మొక్కనే. అయినప్పటికి దీనిలో ఉండే జెల్‌లాంటి పదార్థం నాచురల్ మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. దానిని ముఖంపై రాసుకుని ఆరిన తరువాత నీటితో కడుక్కుంటే సరిపోతుంది. చర్మం పై సహజంగా, ఎలాంటి జిడ్డూ లేకుండా మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.
కొబ్బరి నూనె: (winter)
శీతాకాలంలో చర్మం పగలకుండా, పొడిబారకుండా చేసే వాటిల్లో కొబ్బరి నూనె ఒకటి. రాత్రి పూట ముఖానికి, చర్మానికి, చేతులకు అప్లై చేసుకోవాలి. కొబ్బరి నూనె వల్ల చర్మం మృదువుగా మారుతుంది. ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల చర్మ ఆరోగ్యనికి ఎంతో మేలు చేస్తుంది.
ఆలివ్ ఆయిల్:
చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహజసిద్ధమైన నూనెలు బాగా పనిచేస్తాయి. ఆలివ్ ఆయిల్ కూడా అందులో ఒకటి. దీనిని రాత్రి పడుకునే ముందు అప్లై చేసుకుంటే చాలు. పొడి బారిన చర్మాన్ని ఆలివ్ ఆయిల్లో ఉండే యాంటీ ఆక్సిడంట్లు కోలుకునేలా చేస్తాయి. అంతేకాకుండా ముఖంపై మచ్చలు, చారలను తొలగిస్తుంది.
బాదం నూనె: (winter)
దీని నుండి వచ్చే సువాసనతో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అంతేకాకుండా దీనిలో ఉండే విటమిన్ ఇ చర్మం యొక్క పగుళ్లకు మంచి ఔషధంలా పనిచేస్తుంది. స్నానానికి ముందు బాదాం నూనెను ముఖానికి, చర్మానికి అప్లై చేసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది. బాదం సహజ మాయిశ్చరైజర్‌గా ఉపయోగపడుతుంది. చర్మంలోని తేమను కోల్పోకుండా కాపాడుతుంది.
తేనె :
చర్మం పొడిగా ఉన్నప్పుడు తేనె సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. చర్మంపై దీనిని పూసి కాస్త మర్థన చేస్తూ పది నిమిషాల తర్వత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. వీలున్నప్పుడల్లా ఇలా చేయడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.
వీటికి బదులుగా మార్కెట్ లో కూడా ఎన్నో మాయిశ్చరైజర్స్, సన్ స్క్రీన్, బాడీ లోషన్స్ దొరికుతున్నాయి. ఆరోగ్యకరమైన, మెరిసే చర్మాన్ని పొందాలనుకుంటే మంచి బాడీ లోషన్ వాడటం ఎంతో అవసరం. ఈ బాడీ లోషన్ సహజ, మూలికా పదార్థాలతో తయారు చేయబడింది. వీటిలో అలోవెరా, అవకాడో ఆయిల్, జొజోబా ఆయిల్, గ్లిజరిన్, విటమిన్ ఇ వంటివి ఉంటాయి. వీటిలో రక రకాల ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. ఇలా కూడా శీతాకాలంలో పగుళ్ళు, పోడిబారే చర్మం నుండి ఉపశమనం పొందవచ్చు.
చలికాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు.. (winter)
పోసు కోడానికి బాగుంది కదా అని ఎక్కువ వేడి నీటితో స్నానం చేయకూడదు. స్నానం తర్వాత చర్మం పొడిబారకుండా మాయిశ్చరైజర్స్ ని ఉపయోగించాలి. వాతావరణం చల్లగా ఉండటం వల్ల నీటిని తక్కువగా తీసుకుంటుంటాం. తగినన్ని నీటిని తీసుకోవడం మంచిది. (winter)