క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్ కప్ (WC G2) ప్రారంభానికి అంతా రెడీ అయింది. అయితే ఈ మెగా టోర్నీలో ఏ టీమ్ వరల్డ్ కప్ గెలుస్తుంది..? ఏ జట్టుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి..? హాట్ ఫేవరేట్‌గా ఉన్న టీమిండియాకు ప్రధాన పోటీ ఏ టీమ్ నుంచి ఉంది? ఇలాంటి ప్రశ్నలు క్రికెట్ అభిమానుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. టీమ్ ఇండియా పటిష్టమైన జట్టులోనే బరిలోకి దిగుతోంది.కాబట్టి వాల్డ్ కప్ కొట్టినా ఆశ్చర్యం లేదనేది మనోళ్ల ధీమా…
హాట్ ఫేవరెట్ గా దాయాదులు (WC G2)
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రికెట్ మహా సంగ్రామం వన్డే వరల్డ్ కప్ ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఈ సారి వరల్డ్ కప్‌లో హాట్ ఫేవరేట్‌గా ఓ నాలుగు టీమ్స్ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.అందులో దాయాది పాకిస్థాన్ టీమ్ కూడా ఉంది. వన్డే క్రికెట్లో పాకిస్థాన్ బలమైన టీమ్‌గా ఉంది.
అండర్ డాగ్స్ కి లక్ కలిసొస్తుందా?
దక్షిణాఫ్రికా.. ప్రపంచకప్.. దురదృష్టం.. ఈ మూడూ విడదీయలేని పదాలు. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో అదరగొట్టి మంచి అంచనాలతో ప్రపంచకప్‌లో అడుగు పెట్టే ఆ జట్టు.. అక్కడ మాత్రం సత్తా చాటలేకపోతుంటుంది. కొన్నిసార్లు చేజేతులా ఓటమి కొనితెచ్చుకుంటుంది. కొన్నిసార్లు దురదృష్టం వెంటాడుతుంది. ఎలాగైనా సరే.. మధ్యలో ఆ జట్టు ప్రయాణం ఆగిపోవడం మామూలే! ఈసారి ఆ జట్టుపై మరీ అంచనాలేమీ లేవు. అండర్‌డాగ్‌లా కప్పులో అడుగు పెడుతున్న సఫారీ జట్టు ఈసారి ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.
డార్క్ హార్స్ రేసింగ్ ఎలా ఉంటుంది? (WC G2)
వరుసగా 13 వన్డేవిజయాలు.. 2022 ఆసియాకప్‌లో టైటిల్ కైవసం.. 2023లో రన్నరప్.. ఇది శ్రీలంక జోరు. అయితే ప్రపంచకప్‌లో మహామహా జట్లతో పోలిస్తే లంకను బలమైందిగా చూడలేం. అలా అని ఉపఖండ పరిస్థితుల్లో సత్తా చాటే ఈ జట్టును తీసి పారేయలేం. అందుకే భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో శానక సారథ్యంలోని లంక.. ఓ డార్క్‌హార్స్. క్వాలిఫయింగ్ ద్వారా ఈ టోర్నీకి అర్హత సాధించినా.. వరల్డ్ కప్‌లో అద్భుతాలు చేస్తుందో లేదో తెలియదు కానీ కొన్ని కీలక విజయాలు సాధించగలదని చెప్పవచ్చు.
పసికూనల ఆశలు ఫలిస్తాయా?
వరల్డ్ కప్‌లో పాల్గొనే చిన్న జట్లలో నెదర్లాండ్స్ ఒకటి. పెద్ద జట్లపై ఆడటమే వరంగా డచ్ టీమ్ భావిస్తుంది అనడంలో సందేహం లేదు. అయితే ఈ జట్టులో అటు బ్యాటుతో, ఇటు బంతితో రాణించగల ఆటగాళ్లున్నారు. ఈ ప్రపంచ కప్ లో పసికూనగా అడుగుపెడుతున్న నెదర్లాండ్.. అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ లాంటి జట్లను ఓడించినా ఆజట్టుకు అది గొప్ప ఘనతే.
చూడాలి ఈ గ్రూప్ నుంచి ఫైనల్ కి ఎవరు అర్హత సాధిస్తారో… (WC G2)